తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవికి మారుతి కథ వినిపించారా? - acharya

దర్శకుడు మారుతి, మెగాస్టార్ చిరంజీవి కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్​ కోసం మారుతి ఓ కథను సిద్ధం చేశారట! దీనిపై చిరు త్వరలో నిర్ణయం తెలపనున్నారని సమాచారం.

megastar chiranjivi
చిరంజీవి మారుతి

By

Published : Aug 4, 2021, 8:57 AM IST

Updated : Aug 4, 2021, 11:38 AM IST

మెగాస్టార్​ చిరంజీవి కోసం దర్శకుడు మారుతి ఓ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్టుపై చిరు తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని సమాచారం. చిరుతో పాటు మరో అగ్ర కథానాయకునికీ మారుతి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవితో కలిసి పనిచేయడం తన చిరకాల కోరిక అని మారుతి ఇప్పటికే తెలిపారు. మరి ఈయన కల సాకారమవుతుందో లేదో వేచి చూడాలి.

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య షూటింగ్​లో తీరికలేకుండా గడుపుతున్న మెగాస్టార్​.. లూసీఫర్ రిమేక్​కు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి:'గాడ్​ ఫాదర్​'గా మెగాస్టార్​ చిరంజీవి!

Last Updated : Aug 4, 2021, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details