తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2021, 4:40 PM IST

ETV Bharat / sitara

'శివరాత్రి' సినిమాలు ఇవే- ఆకట్టుకునేదెవరు?

థియేటర్​లో నవ్వులు పూయించేందుకు.. భావోద్వేగానికి గురి చేసేందుకు.. స్ఫూర్తి నింపేందుకు.. యాక్షన్​ ఘట్టాలతో అదరగొట్టేందుకు.. ఇలా పలు సినిమాలు శివరాత్రిని పురస్కరించుకొని ప్రేక్షలను పలకరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? ఇంతకి ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.

sreekaram
శ్రీకారం

లాక్​డౌన్​ ముగియగానే టాలీవుడ్​లో సినిమాల మధ్య పోరు మొదలైపోయింది. ఇప్పటికే పలు చిత్రాలు రిలీజై హిట్​ అవ్వగా.. మరికొన్ని మిశ్రమ స్పందనను అందుకున్నాయి. ఈ క్రమంలోనే శివరాత్రి(మార్చి 11)కి పలకరించేందుకు కొత్త సినిమాలు ముస్తాబయ్యాయి. కామెడీ, యాక్షన్​, ఫ్యామిలీ సెంటిమెంట్​, ఇన్​స్పిరేషన్​​ ఇలా వివిధ కథాంశాలతో థియేటర్లలో మీ ముందుకు వస్తున్నాయి. మరి ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయా? ఇంతకీ ఆ సినిమాలేంటి? ఓ సారి లుక్కేద్దాం.

శ్రీకారం

చదువుకున్న యువత వ్యవసాయ రంగంలో అడుగుపెడితే ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పేందుకు సిద్ధమయ్యాడు హీరో శర్వానంద్​. ఆయన నటించిన 'శ్రీకారం' సినిమాలో ఈ విషయాన్నే చూపించబోతున్నారు. నూతన దర్శకుడు కిశోర్ బి దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. ఈ చిత్రంలో ప్రియాంక హీరోయిన్​గా నటించగా.. నరేశ్​, రావురమేశ్​ కీలక పాత్ర పోషించారు.

జాతిరత్నాలు

ముగ్గురు అమాయకులు ఓ నేరంలో ఇరుక్కుంటే? చట్టాలపై అవగాహన లేని వాళ్లు పోలీసు స్టేషన్‌, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తే ఎలా స్పందిస్తారు? అనే కథాంశంతో రాబోతుంది 'జాతిరత్నాలు' సినిమా. ఈ కథకు కామెడీ జోడించి కడుపబ్బా నవ్వించబోతున్నారు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నవీన్​ పొలిశెట్టి, రాహుల్​, ప్రియదర్శి. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకుడు. మరి వీరు ఏ మాత్రం ప్రేక్షకుల్ని నవ్విస్తారో చూడాలి మరి.

గాలి సంపత్​

గాలితో మాత్రమే మాట్లాడే ఓ వ్యక్తి ఎదుర్కొన్న సమస్యల సమాహారమే 'గాలి సంపత్'​ సినిమా కథ. ఓ బావిలో ఇరుక్కుపోయిన మాటలు రాని వ్యక్తి​ అందులో నుంచి ఎలా బయటకొచ్చాడన్నదే ఇందులో చూపంచబోతున్నారు. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌(గాలిసంపత్​) ప్రధాన పాత్రలో తెరకెక్కిందీ సినిమా. వీరిద్దరి మధ్య వచ్చే తండ్రీకొడుకుల సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తూనే కంటతడి పెట్టిస్తాయి. అనిల్​ రావిపూడి పర్యవేక్షణలో అనీష్‌కృష్ణ తెరకెక్కించారు. మరి వీరి సినీప్రియులను తమ కామెడీ, సెంటిమెంట్​తో ఆకట్టుకుంటారో లేదో.

రాబర్ట్​

కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం 'రాబర్ట్‌'. తెలుగులోనూ ఇదే పేరుతో రాబోతుంది. ఆశాభట్‌ నాయిక. వినోద్‌ ప్రభాకర్‌, జగపతిబాబు, రవి శంకర్‌ తదితర తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. తరుణ్‌ కిశోర్‌ సుధీర్‌ దర్శకుడు. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, విజువల్స్‌, నేపథ్య సంగీతంతో ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

'నన్నంతం చేయాలనుకునే వాడు నాకన్నా పెద్ద క్రిమినల్‌ బ్రెయిన్‌ అయి ఉండాలి. నాకన్నా టెర్రర్‌ అయి ఉండాలి.. నాకన్నా వైలంట్‌ అయి ఉండాలి', 'ఒకరి లైఫ్‌లో హీరో అవ్వాలనుకుంటే ఇంకొకరి లైఫ్‌లో విలన్‌ అవ్వాల్సిందే', 'శబరి ముందు తలొంచడం తెలుసు.. రావణుడి తల తుంచడమూ తెలుసు' అనే సంభాషణలు అలరించాయి. మన తెలుగు సినిమాలు మించి ఏ రేంజ్​లో ఈ సినిమా అభిమానులను అలరిస్తుందో?

ఇదీ చూడండి:'తుఫాన్'​, 'ఫౌజీకాలింగ్​' విడుదల తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details