తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అంబులెన్స్ అందుబాటులో లేక నటి మృతి - amubulance unavialability

అంబులెన్స్ సమయానికి రాకపోవడం వల్ల మరాఠీ టీవీ నటి పూజ జుంజర్ మరణించింది. ఆదివారం మహరాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మరాఠీ నటి

By

Published : Oct 24, 2019, 12:00 PM IST

సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే చూశాం. సామాన్య ప్రజానీకానికే కాకుండా ఓ మరాఠీ నటికీ అదే దుస్థితి ఏర్పడింది. మహారాష్ట్రకు చెందిన టీవీ నటి పూజ జుంజర్ అంబులెన్స్​సమయానికి రాకపోవడం వల్ల మరణించింది. అప్పుడే జన్మించిన ఆమె శిశువు కూడా మృతిచెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్ర హింగోలీ జిల్లాలోని గోరేగావ్​ ప్రాథమిక హెల్త్​ సెంటర్​లో ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు పూజ ఓ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్దిసేపటికే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. మెరుగైన వైద్యం కోసం నటిని హింగోలీలో ఆసుపత్రికి తరలించాలని సూచించారువైద్యులు.

ఆ ఆసుపత్రి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వ అంబులెన్స్‌ లేకపోవడం వల్ల ఆలస్యం జరిగింది. తర్వాత ఓ ప్రైవేటు అంబులెన్స్​లో ఆసుపత్రికి బయలుదేరగా.. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ప్రసవం కోసం సొంత ఊరు గోరేగావ్​కు వచ్చిన పూజా... ఈ విధంగా అకాల మరణం చెందడం గ్రామస్థులను కలచి వేస్తోంది.

ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. పూజా మరాఠీలో రెండో చిత్రాల్లో నటించింది. గర్భం దాల్చిన కారణంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన అక్టోబరు 21నే ఈ సంఘటన జరగడం గమనార్హం.

ఇదీ చదవండి: బుసలు కొట్టే అందం.. మల్లిక సొంతం..!

ABOUT THE AUTHOR

...view details