రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలు పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు.. హనుమాన్ పాత్రను ఇంకా పరిచయం చేయలేదు.
దీంతో ఈ రోల్లో ఎవరు నటిస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే మరాఠీ నటుడు దేవదత్త నాగె పేరు తెరపైకి వచ్చింది. ఆయనే ఆంజనేయుడిగా కనిపించబోతున్నట్లు సోషల్‌మీడియాలో పోస్టులు కనపడుతున్నాయి. ఆయన వికీపీడియాలో కూడా 'ఆదిపురుష్'లో హనుమాన్‌గా కనువిందు చేయనున్నట్లు చూపిస్తుంది. నాగె కూడా కండలు తిరిగన దేహంతో వాయుపుత్రుడు పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.