తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో అక్షయ్ కుమార్​ సరనస 'మిస్​ వరల్డ్' - అక్షయ్ కుమార్​తో మానుషీ చిల్లర్

మాజీ మిస్​ వరల్డ్ మానుషీ చిల్లర్​.. హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న 'పృథ్వీరాజ్' సినిమాలో హీరోయిన్​గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

అక్షయ్ కుమార్-మానుషీ చిల్లర్

By

Published : Nov 15, 2019, 12:34 PM IST

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసనమాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్​గా అవకాశం దక్కించుకుంది. 'పృథ్వీరాజ్​' సినిమాలో సన్యోగితా పాత్రతో తెరంగేట్రం చేస్తోంది.

ఈ అవకాశం దక్కడంపై ఆనందం వ్యక్తం చేసిందీ భామ. బాలీవుడ్​ టాప్ స్టార్స్​తో కలిసి తొలి సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తానని తెలిపింది.

మాజీ మిస్​ వరల్డ్ మానుషీ చిల్లర్

"మిస్ ఇండియా.. మిస్​ వరల్డ్.. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇది నా జీవితంలో సరికొత్త అధ్యాయం. రాణి సన్యోగితా పాత్ర పోషించడం చాలా పెద్ద బాధ్యత. భారతదేశ చరిత్రలో ఆమె జీవితం చాలా ముఖ్యమైన భాగం. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను" -మానుషీ చిల్లర్,హీరోయిన్

'పృథ్వీరాజ్ చౌహాన్' పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్​రాజ్ ఫిల్మ్స్​ నిర్మాతగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: సెట్​లో అక్షయ్​, రోహిత్‌ గొడవ.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details