రెండు జాతీయ అవార్డులు, పద్మశ్రీ బిరుదు, విలక్షణ నటుడుగా స్టార్ హోదా, అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఇదంతా మనోజ్ బాజ్పేయీ సొంతం. అయితే ఇవన్నీ సంపాదించే క్రమంలో ఈ నటుడు ఓ మినీ యుద్ధమే చేశారట. అయితే ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. గతంలో ఓ సందర్భంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వూలో వెల్లడించారు.
తొమిదేళ్లు ఉన్నప్పుడే నటనపై ఆసక్తి
బిహార్‌లో పుట్టిపెరిగిన మనోజ్‌కు తొమ్మిదేళ్ల ఉన్నప్పుడే గొప్ప నటుడి కావాలని కలలు కన్నారు. బాలీవుడ్‌పై మక్కువతో కొన్నాళ్ల తర్వాత ముంబయి చేరుకున్నారు. అక్కడ నెగ్గుకురావాలంటే చాలా భాషలు తెలుసుండాలని, దీనితోపాటే ప్రఖ్యాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇన్స్టిట్యూట్లో చేరాలని భావించారు. కానీ అందులో చేరేందుకు కొన్ని ప్రత్యేకమైన నైపుణ్య అర్హతలు ఉండాలని తెలుసుకున్నారు.
దీంతో నిరంతరంగా కృషి చేసి, పట్టుదలతో తనకు వచ్చిరానీ ఆంగ్ల, హిందీ భాషలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు మనోజ్. ఎట్టకేలకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు దరఖాస్తు చేశారు. కానీ ఊహించని రీతిలో తిరస్కరణకు గురయ్యారు. ఇలా వరుసగా మూడుసార్లు జరిగింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నం చేశారు. అదృష్టవశాత్తు అదే సమయంలో మిత్రులు అతడిని రక్షించినట్లు వెల్లడించారు.
భయపడి ఎదగనివ్వరు