నటి వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'మన్నే నంబర్ 13' . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది.
ఈ ట్రైలర్లో ఐదుగురు ఐటీ నిపుణులు (సాప్ట్ వేర్ ఇంజినీర్స్) సంతోషంగా సరదాగా షికార్లు చేస్తూ గడుపుతుంటారు. ఆ తర్వాత వాళ్లు ఓ రాత్రి సమయంలో కారులో రోడ్డు ప్రయాణం చేస్తుంటారు. అనుకోకుండా మధ్యలో రోడ్డుపై ఓ వింత ఆకారం కనిపిస్తుంది. దాంతో వాళ్లు కారు వదిలేసి బయటకు వస్తారు. ఓ కొత్త ఇంట్లోకి ప్రవేశించిన వాళ్లకు భయంకరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. విషయం తెలుసుకునే లోపు ఒకరి తరువాత ఒకరు చనిపోతుంటారు. ఇప్పుడు వారిని నిజంగా ఏదైనా వెంటాడుతుందా లేక వేరెవరైనా ఒక పథకం ప్రకారం బీభత్సం సృష్టిస్తున్నారో తెలియాలంటే చిత్రం తెరపైకి వచ్చే వరకు ఆగాల్సిందే.