తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోర్చుగల్​లో మన్మథుడి కోసం రకుల్​ వేట - నాగార్డున

నాగార్జున, రకుల్​ ప్రీత్​ సింగ్​ జంటగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. ఈ సినిమా ప్రస్తుతం పోర్చుగల్​లో షూటింగ్​ జరుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది రకుల్​.

పోర్చుగల్​లో మన్మథుడి కోసం రకుల్​ వేట

By

Published : Apr 18, 2019, 6:18 PM IST

నాగార్జున సినీకెరీర్‌లో ‘మన్మథుడు’ చిత్రం ఓ మైలురాయి. సూపర్​హిట్​గా నిలిచిన ఆ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్​ను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. సెట్‌లోని ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది రకుల్‌.

కథ ఇదేనా..?

పెళ్లిపై నమ్మకం లేని ఓ యువకుడి నేపథ్యంలో ‘మన్మథుడు’ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ దాదాపు ఇదే కథాంశంతో సాగనుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో నాగ్‌కు చాలా మంది అక్కాచెల్లెళ్లు ఉంటారు. వాళ్ల పెళ్లికి తన పెళ్లి అడ్డుగా ఉందనే కారణంతో.. ఇష్టంలేకున్నా తప్పని పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకుంటాడట. అక్కడి నుంచి నాగ్‌కు కష్టాల ప్రయాణం మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

‘మన్మథుడు’లో పారిస్‌ నేపథ్యంగా వచ్చిన సన్నివేశాలకు మంచి ఆదరణ దక్కింది. ఈ సీక్వెల్‌లో పోర్చుగల్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలవబోతుందట. అత్యధిక భాగం చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ పాత్ర కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతుంటే.. సమంత ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.

ABOUT THE AUTHOR

...view details