'పెళ్లంటే నూరేళ్ల మంటరా' అంటూ హితోపదేశం చేసిన 'మన్మథుడు' మరోసారి వెండితెరపై కనువిందు చేయనున్నాడు. ఆ సినిమాలో నాగార్జున పాత్ర ప్రవర్తించిన తీరు, వేసిన సెటైర్లు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'మన్మథుడు-2' తెరకెక్కుతోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జూన్ 11న నాగార్జున-అమల దంపతుల పెళ్లి రోజు సందర్భంగా చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. గురువారం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వైవిధ్యంగా మన్మథుడు-2 కొత్త పోస్టర్ - మన్మథుడు
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తోన్న చిత్రం 'మన్మథుడు-2'. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తిసురేశ్ కథానాయికలు. ఈరోజు కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
వైవిధ్యంగా మన్మథుడు-2 కొత్త పోస్టర్
తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించారు. పేకాటలోని కింగ్ ముక్క రూపంలో తయారుచేశారు. అందులో నాగ్ ఓ వైపు వైన్ గ్లాస్‌తో, మరోవైపు కాఫీ గ్లాస్‌తో దర్శనమిస్తున్నాడు.
రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, కిరణ్ నిర్మాతలు. మంచు లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు.