తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎక్కడో కొడుతంది చిన్నా... 'మన్మథుడు' ట్రైలర్ - chinmayi

కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు-2' ట్రైలర్​ విడుదలైంది. రకుల్ ప్రీత్ హీరోయిన్​గా నటించింది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన్మథుడు-2 ట్రైలర్

By

Published : Jul 25, 2019, 12:38 PM IST

Updated : Jul 25, 2019, 1:32 PM IST

'మన్మథుడు'.. ఈ సినిమా వచ్చి దాదాపు 17 ఏళ్లయింది. కానీ ఇప్పటికీ ఆ చిత్రానికున్న ఆదరణ వేరు. దానికి సీక్వెల్​ తెరకెక్కిస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. తాజాగా విడుదలైన 'మన్మథుడు-2' ట్రైలర్ వాటిని నిజం చేస్తూ అభిమానులను అలరిస్తోంది. లిప్​లాక్​లు, సెంటిమెంట్, హాస్యం తదితర అంశాలు ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్​ లుక్​లో నాగ్ కనువిందు చేస్తున్నాడు.​

నువ్వు పెళ్లి చేసుకోవా అని హీరోయిన్​ అంటే.. "ఒక్క పూట భోజ‌నం కోసం నేను వ్య‌వ‌సాయం చేయ‌ను", "నా జీవితం నా కోస‌మే.. నేను పిల్ల‌ల్ని క‌న‌ను" అంటూ సెటైర్స్ వేశాడు కింగ్ నాగార్జున. ఈ వయసులోనూ యువహీరోల్లా లిప్​లాక్​లు పెడుతూ అంచనాల్ని పెంచేస్తున్నాడు.

కుటుంబ కథ నేపథ్యంలో సినిమాను తీసినట్లు తెలుస్తోంది. మొదటి చిత్రం 'చి.ల.సౌ'తో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: అమెరికాలో ఓ బేబీకి మిలియన్ డాలర్ల వసూళ్లు

Last Updated : Jul 25, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details