తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియురాలు కీర్తితో మన్మథుడి రొమాన్స్​​ - నాగార్జున హీరోగా

కింగ్ నాగార్డున కథానాయకుడిగా సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మన్మథుడు'. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు2’ రూపొందుతోంది. నటీమణులు రకుల్​, సమంత సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా... తాజాగా మరో నటి కీర్తి సురేశ్​ జత కలిసింది.

ప్రియురాలు కీర్తితో మన్మథుడి జోష్​

By

Published : Jun 5, 2019, 7:30 AM IST

Updated : Jun 5, 2019, 11:46 AM IST

కింగ్​ నాగార్జున హీరోగా రాహుల్​ రవీంద్రన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మన్మథుడు-2'. 2002na బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన 'మన్మథుడు' చిత్రానికి ఈ సినిమా సీక్వెల్​. తొలి భాగంలానే మరోసారి అందమైన భామలతో కలిసి సందడి చేయబోతున్నాడు నాగ్​. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమా ప్రధాన కథానాయిక. సమంత, కీర్తి సురేశ్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మన్మథుడు 2లో కీర్తిసురేశ్​

ప్రస్తుతం హైదరాబాద్‌లోఈ సినిమాచిత్రీకరణ జరుగుతోంది. నాగార్జున, ఇతర చిత్రబృందంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో నటి కీర్తి సురేశ్ చిత్రీకరణలో పాల్గొన్నట్లు మంగళవారం ప్రకటించింది చిత్రబృందం. కీర్తి కొత్త స్టిల్స్‌ను సోషల్​మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో ఆమె నాగార్జునకు ప్రేయసిగా కనిపించనున్నట్లు సమాచారం.

చిత్రీకరణలో నాగ్​, కీర్తి

శరవేగంగా సాగుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే సింహభాగం పూర్తయినట్టు తెలుస్తోంది. ‘మన్మథుడు’ తరహా వినోదంతో ఈ చిత్రం రూపొందుతోందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. మంచు లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్నారు.

మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ కలిసి రూపొందిస్తోన్న ఈ చిత్రానికి నాగార్జున, పి.కిరణ్‌ నిర్మాతలు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం సమకూర్చారు.

Last Updated : Jun 5, 2019, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details