బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ గతేడాది నిర్వహించిన పార్టీకి సంబంధించిన వీడియోపై దిల్లీ మాజీ ఎమ్మెల్యే మనిజిందర్ శిర్షా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి ఫిర్యాదు చేశారు. కరణ్‌తో పాటు పార్టీకి హాజరైన పలువురు బాలీవుడ్ ప్రముఖులపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఎన్సీబీ చీఫ్ రాకేశ్ అస్థానాను కోరినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
డ్రగ్స్ పార్టీ: కరణ్‌పై దిల్లీ మాజీ ఎమ్మెల్యే ఎన్సీబీకి ఫిర్యాదు - కరణ్
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్‌పై దిల్లీ మాజీ ఎమ్మెల్యే మనిజిందర్ శిర్షా ఎన్సీబీకి ఫిర్యాదు చేశారు. గతేడాది తన నివాసంలో నిర్వహించిన ఓ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని.. అపుడు వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపించారు శిర్షా.
పార్టీకి సంబంధించిన వీడియోపై గతేడాది ముంబయి పోలీసులకు తాను ఫిర్యాదు చేసినట్లు మన్జిందర్ వెల్లడించారు. అయితే, విచారణ చేపట్టడంలో వారు విఫలమయ్యారని అన్నారు.
ఇందులో బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొణె, విక్కీ కౌశల్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, రణ్‌బీర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. అపుడు, వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కరణ్.. అక్కడ ఉన్నవారంతా సొంతగా ఎదిగి పైకి వచ్చినవారేనని ఒకవేళ వారంతా డ్రగ్స్ తీసుకుని ఉంటే.. ఈ వీడియో నేనెందుకు మీ అందరితో పంచుకుంటా అంటూ బదులిచ్చారు.