ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత చిరు, మణిశర్మ కలయికలో చిత్రం రాబోతుంది. 'ఆచార్య' సినిమా గురించి కొత్త అప్డేట్ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు స్వరకర్త మణిశర్మ.
'మెగాస్టార్- కొరటాల చిత్రంలో ఐటెం సాంగ్ పక్కా' - koratala Siva
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రం గురించి కొత్త అప్డేట్ చెప్పారు సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాలో ఓ ఐటెం సాంగ్, రొమాంటిక్ సాంగ్‌తో పాటు ఇద్దరూ హీరోలపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చిరంజీవి కొత్త సినిమాలో ఒక ఐటెం సాంగ్, ఇద్దరూ హీరోలతో మరొకటి, ఒక రొమాంటిక్, ఎమోషనల్, డాన్స్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నామని మణిశర్మ తెలిపారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకు సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటుందని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
'ఆచార్య' చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఓ కీలకపాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.