తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సమయంలో మనీషా ఎంతో సహాయపడింది' - సొనాలీ బింద్రే

క్యాన్సర్​తో బాధపడుతున్న సమయంలో మనీషా కొయిరాలా తనకెంతో సహాయపడిందని తెలిపింది సొనాలీ బింద్రే.

'ఆ సమయంలో మనీషా ఎంతో సహాయపడింది'

By

Published : May 9, 2019, 7:03 PM IST

క్యాన్యర్​తో బాధపడుతున్న సమయంలో మనీషా కొయిరాలా తనకు ఎంతో సహాయపడిందని బాలీవుడ్ హీరోయిన్​, క్యాన్సర్ బాధితురాలైన సొనాలీ బింద్రే చెప్పింది. ఆమె ఇచ్చిన సలహాలు వ్యాధిని ఎదుర్కొనేందుకు తోడ్పడ్డాయని తెలిపింది. బుధవారం బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన సొనాలీ.. ఈ విషయాల్ని వెల్లడించింది.

"క్యాన్సర్​తో బాధపడుతున్న సమయంలో మనీషా ఎంతగానో సహాయపడింది. ఎందుకంటే ఆమె ఆ బాధల్ని అనుభవించే వచ్చింది. దీనికి సంబంధించిన ఓ పుస్తకాన్ని రచించింది" -సొనాలీ బింద్రే, నటి

అదే విధంగా తన భర్త గోల్డీ భేల్​ను అభినందించింది. ఈ వ్యాధిని ఎదుర్కొవడంలో అతడెంతో తోడ్పాటు అందించాడని సొనాలీ పేర్కొంది.

2012లో క్యాన్సర్​కు గురైన మనీషా కొయిరాలా.. పలు రకాల చికిత్సల అనంతరం 2014లో ఆ వ్యాధి నుంచి బయటపడింది.

ABOUT THE AUTHOR

...view details