ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తి, త్రిష, ప్రకాశ్‌రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో తొలి భాగాన్ని 'పీఎస్ 1' పేరుతో విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.
'పొన్నియిన్ సెల్వన్'లో విక్రమ్, ఐశ్వర్య పాత్రలు ఇవేనా? - పొన్నియిన్ సెల్వన్ అప్డేట్స్
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలోని పాత్రలకు సంబంధించిన జాబితా ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. దాంతో పాటు పాత్రధారులకు సంబంధించిన స్కెచెస్ కూడా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతోంది. తాజాగా ఇందులోని పాత్రలకు సంబంధించిన జాబితా ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. దాంతో పాటు పాత్రధారులకు సంబంధించిన స్కెచెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇందులో ఐశ్వర్యా రాయ్.. నందిని, మందాకినీ అనే రెండు పాత్రల్లో, విక్రమ్ ఆదికరి కాలన్‌గా, వందీయాతేవన్ పాత్రలో కార్తి, త్రిష.. కుందాదేవిగా, సుందర ఛోహార్ పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నట్టు ఈ జాబితాలో ఉంది. 'పీఎస్ 1' వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇదీ చదవండి:స్టార్ హీరో ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా