టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను బయోపిక్కు రంగం సిద్ధమైంది. ఆమె జీవితాధారంగా సినిమాను రూపొందించనున్నట్లు మణిపుర్‌కు చెందిన ఓ చిత్ర నిర్మాణసంస్థ ప్రకటించింది.
ఒలింపిక్స్ విజేత మీరాబాయ్ బయోపిక్ రెడీ - వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను
ఒలింపిక్స్ విజేత, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ బయోపిక్కు అంతా రెడీ అయింది. మణిపుర్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.
వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ బయోపిక్కు రంగం సిద్ధం
స్యూటీ ఫిల్మ్స్ ప్రొడక్షన్ కంపెనీ ఛైర్మన్ మనోబి ఎమ్.ఎమ్. మాట్లాడుతూ.."మీరాబాయి చాను జీవితంలోని అనేక సంఘటనల ఆధారంగా మేం ఓ సినిమా రూపొందించనున్నాం" అని ఇటీవలే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మీరాబాయి చానుతో నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను మనోబి ఎమ్.ఎమ్. అందించనుండగా.. ఓ.సి. మీరా దర్శకత్వంలో ఆర్.కె. నళిని దేవి నిర్మించనున్నారు.
ఇదీ చూడండి..ఇంటికి చేరిన మీరా.. మణిపూర్‌లో ఘన స్వాగతం