తమ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు మణిరత్నం, ఏఆర్ మురుగదాస్‌లు. వీరి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోవడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తాయి. తాజాగా ఈ డైరెక్టర్ల దృష్టి.. ఓ ప్రముఖ నిర్మాత బయోపిక్‌పై పడింది. ఆ వ్యక్తే.. 'లైకా గ్రూప్స్' అధినేత సుభాస్కరన్.. ఈయన జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు వీరిద్దరూ ఆసక్తి చూపించారు.
సుభాస్కరన్కు ఇటీవలే మలేసియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మణిరత్నం, మురుగదాస్.. తమ మనసులో మాటల్ని చెప్పారు.
"సుభాస్కరన్ జీవితం చాలా స్ఫూర్తిదాయకమైనది. ఏదో ఒకరోజు ఆయన బయోపిక్ తీయాలనుకుంటున్నా"
-మణిరత్నం, దర్శకుడు
"మణిరత్నం.. సుభాస్కరన్ బయోపిక్ తీస్తానని అన్నారు. ఆయన జీవితంలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒకవేళ మణి.. మొదటి భాగం తీయాలనుకుంటే, నేను సీక్వెల్ తీస్తాను"
-ఏఆర్ మురుగదాస్, దర్శకుడు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'దర్బార్'కు మురుగదాస్ దర్శకుడు. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' సినిమాను తీస్తున్నాడు మణిరత్నం. ఈ రెండింటికి సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సుభాస్కరన్.. లైకా మొబైల్స్‌తో పాటు, లైకా ఫిల్మ్ ప్రొడక్సన్స్ సంస్థను స్థాపించి.. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150', కోలీవుడ్ హీరో విజయ్ 'కత్తి', రజనీకాంత్ 'రోబో 2.0' సినిమాలు నిర్మించారు.
ఇదీ చూడండి:ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. రికార్డుల వేట..!