తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మధుబాలకు 'రోజా' అలా దక్కిందట! - roja vie

అరవింద్ స్వామి, మధుబాల జోడీగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రోజా'. ఈ సినిమాలో అరవింద్-మధుబాల జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్​గా మనీషా కోయిరాలాను అనుకుందట చిత్రబృందం.

మధుబాలకు 'రోజా' అలా దక్కిందట!!
మధుబాలకు 'రోజా' అలా దక్కిందట!!

By

Published : Aug 19, 2020, 5:32 AM IST

ప్రేమ కథలను తెరకెక్కించడంలో మణిరత్నం స్టైలే వేరు. తరాలు మారినా ఆయన సినిమాలు మాత్రం ఎప్పటికీ తాజాగానే ఉంటాయి. అందుకే ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని నటులందరూ ఆశపడుతుంటారు. అరవింద్‌ స్వామి కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషలో విజయం సాధించిన 'రోజా' గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో అరవింద్‌కు జోడీగా మధుబాల అద్భుతమైన రొమాన్స్‌ను పండించింది. ఆగస్టు 15, 1992 చిత్రం విడుదలైంది. వీరిద్దరి కెమిస్ట్రీ అప్పట్లో సినీప్రియుల మదిని విశేషంగా ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ సినిమా మొదలు పెట్టాలనుకున్నప్పుడు కథానాయిక పాత్ర కోసం ముందుగా మనీషా కోయిరాలాని తీసుకోవాలనుకున్నారట. ఈ కథ విని ఆమె కూడా చేసేందుకు ఆసక్తి చూపించిందట. కానీ, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆమె చేయలేకపోవడం వల్ల మధుబాలను ఎంపిక చేశారు మణిరత్నం. అయితే 'రోజా'లో నటించే అవకాశాన్ని మనీషా కోల్పోయినా.. ఆ తర్వాత మణిరత్నం నుంచి వచ్చిన హిట్‌ చిత్రాలు 'బొంబాయి', 'దిల్‌సే'లో ఆమె కథానాయికగా మెరిపించి మురిపించింది.

ABOUT THE AUTHOR

...view details