వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్న యువ కథా నాయకుల్లో సంతోష్ శోభన్(manchi rojulu vachayi santosh) ఒకరు. 'ఏక్ మినీ కథ'తో విజయాన్ని అందుకున్న ఆయన, ఇటీవల మారుతి దర్శకత్వంలో(manchi rojulu vachayi 2021 director) 'మంచి రోజులు వచ్చాయి' చేశారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సంతోష్‌శోభన్(manchi rojulu vachayi movie hero name) విలేకర్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం..
"పని లేనప్పుడు పని దొరికితే, డబ్బు లేనప్పుడు డబ్బొస్తే అదే మంచి రోజు అనుకుంటాం. ఇప్పుడిప్పుడే కొంచెం డబ్బు సంపాదిస్తున్నా. వెనక్కి తిరిగి చూస్తే అప్పట్లో పడిన ఇబ్బందులు బాగున్నాయనిపిస్తోంది. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో డబ్బు లేదు కానీ, ఆ జీవితాన్ని బాగా ఆస్వాదించేవాళ్లం. గణపతి కాంప్లెక్స్ దగ్గర పునుగులు తింటూ జీవితం గురించి ఆలోచించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. విజయం వచ్చిన రోజే మంచి రోజులు అనుకోకూడదు. నా దృష్టిలో ఇబ్బందులు పడ్డ క్షణాలూ మంచివే. మంచి రోజులు అంటే అదొక మైండ్‌సెట్. ఆ రోజులు వచ్చాయని మనం అనుకుంటే వచ్చేసినట్టే".
ఎవరూ బయటికి రాని పరిస్థితుల్లో మీరు ఈ సినిమా కోసం రంగంలోకి దిగారు. భయం అనిపించలేదా?
జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి భయం అనిపించలేదేమో. ఆ సమయంలో మేం అంతా ఆకలిమీద ఉన్నాం. పని చేయడం అవసరం. పని లేకపోతే గడవదు కదా. పైగా యు.వి సంస్థ, మారుతి అన్న కలయికలో సినిమా. సూపర్ అవకాశం కదా అనిపించింది. ఆ ఆత్రుతలోనే ఉన్నాను తప్ప, ఇక భయం అనే ఆలోచనే నాకు రాలేదు. ఇంట్లోవాళ్ల భయాలంటారా? మా అమ్మకి నాకంటే ఎక్కువ సినిమా పిచ్చి (నవ్వుతూ). నేను, మా తమ్ముడు చిత్రీకరణ కోసం వెళ్లామంటే చాలు... మా అమ్మ చాలా సంతోషిస్తారు.
'ఏక్ మినీ కథ' వల్లే ఈ అవకాశం వచ్చిందా?
కచ్చితంగా అంతే(ek mini katha movie hero name). దర్శకుడు మారుతి, నిర్మాత వంశీ అన్న నన్ను నమ్మారు. 'ఏక్ మినీ కథ' అందరికంటే ముందే చూశారు మారుతి. ఆ తర్వాత 'ఒక కథ అనుకున్నా తమ్ముడూ, మనం చేద్దాం' అని చెప్పారు. 'ఏక్ మినీ కథ' విడుదలకు ముందు సగభాగం, విడుదల తర్వాత ద్వితీయార్ధం కథ చెప్పారు. 'ఏక్ మినీ కథ' విజయాన్ని ఆస్వాదించకముందే 'మంచి రోజులు వచ్చాయి' కోసం రంగంలోకి దిగాం.
ఇంతకీ 'మంచి రోజులు వచ్చాయి' ఎలా ఉంటుంది?