బాలీవుడ్ ప్రముఖ నటి మందిరా బేడీ(Mandira Bedi) భర్త, దర్శకనిర్మాత రాజ్ కౌశల్.. బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని మరో దర్శకుడు ఓనిర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు మృతిచెందినట్లు తెలిపారు. ఈయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Mandira Bedi: 'సాహో' నటి భర్త కన్నుమూత - మందిర బేడి భర్త మృతి
ప్రముఖ నటి మందిరా బేడీ(Mandira Bedi) భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హిందీలో పలు సినిమాలకు ఈయన దర్శకత్వం వహించారు.
![Mandira Bedi: 'సాహో' నటి భర్త కన్నుమూత mandira bedi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12308234-952-12308234-1625030320368.jpg)
మందిర బేడి
రాజ్ కౌశల్.. 'ఆంటోని కౌన్ హై', 'షాది కా లడ్డు', 'ప్యార్ మై కభీ కభీ', 'మై బ్రదర్' సినిమాలకు దర్శకత్వం వహించారు. స్టంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. మందిరా బేడీ.. నటి, ఫ్యాషన్ డిజైనర్, టెలివిజన్ ప్రెజంటర్గా పనిచేస్తున్నారు. ఎన్నో హిట్ సినిమాలకు పనిచేశారు. వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2019లో ప్రభాస్ 'సాహో'లోనూ కీలకపాత్రలో కనిపించి మెప్పించారు.
ఇదీ చూడండి: వయసేమో 46... బికినీతో 'బేడీ' హుషారు
Last Updated : Jun 30, 2021, 11:05 AM IST