ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలామందిని అనేక ఇబ్బందులకు గురిచేసింది. లాక్‌డౌన్ కారణంగా సింగపుర్లో చిక్కుకుపోయిన తెలుగు కథానాయకుడు మంచు విష్ణు భార్య విరానిక త్వరలోనే ఇండియాకు చేరుకోనుంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. విరానిక కూడా దేశానికి రాబోతుంది.
ఎట్టకేలకు ఇంటికొస్తున్న మంచు విష్ణు భార్య - మంచు విష్ణు తాజా వార్తలు
కరోనా లాక్‌డౌన్ కారణంగా సింగపుర్‌లోనే ఉండిపోయింది మంచు విష్ణు భార్య విరానిక. తాజాగా దేశానికి వస్తున్నానంటూ ట్వీట్ చేసింది.
విష్ణు
"ఎట్టకేలకు 100రోజుల తర్వాత ఇంటికొస్తున్నాం. ఇందుకు కారణమైన ప్రభుత్వాలకు, విమానయాన సంస్థలకు, సింగపుర్ అధికారులకు ధన్యవాదాలు.." అంటూ ఇద్దరు కుమార్తెలతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది విరానిక. కరోనా వైరస్ కారణంగా సుమారు 100రోజుల పైగా సింగపుర్‌లోనే ఉండిపోయింది. .