తెలంగాణ

telangana

ETV Bharat / sitara

MAA Elections: 'ఈవీఎంలపై మాకు నమ్మకం లేదు'

'మా'(maa elections 2021) ఎన్నికలు బ్యాలెట్​ విధానంలో నిర్వహించాలని ఎన్నికల అధికారికి లేఖ రాశారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు. ఈవీఎంలపై తమ ప్యానెల్‌ సభ్యులకు నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.

maa
మా

By

Published : Oct 5, 2021, 2:31 PM IST

Updated : Oct 5, 2021, 3:27 PM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (maa elections schedule) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త వివాదాలు, విమర్శలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా 'మా' ఎన్నికల్లో బ్యాలెట్‌ వినియోగంపై ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌(maa elections prakash raj panel) ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అదే ఎన్నికల అధికారికి మంచు విష్ణు(maa elections prakash raj panel) లేఖ రాశారు. ఈవీఎంలపై తమ ప్యానెల్‌ సభ్యులకు నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.

"అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలి. ఈ విధానంలో జరిగే పోలింగ్‌లో పారదర్శకత ఉంటుంది. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనది. బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తే సీనియర్లు చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది" అని మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'పోస్టల్​ బ్యాలెట్​తో మంచు విష్ణు మాయ'.. ప్రకాశ్​రాజ్​ ఫిర్యాదు

Last Updated : Oct 5, 2021, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details