మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై హోరాహోరీగా పోరాడిన విష్ణు భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి.. 'మా' సభ్యుల పింఛన్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు - మా ఎన్నికలు మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీతో పాటు, విష్ణు ప్యానెల్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
మంచు విష్టు
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతి విషయాన్ని రానున్న రోజుల్లో పూర్తి చేసి.. అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానని ఆయన తెలిపారు. మరోవైపు ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి విజయం సాధించిన 11 మంది సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Last Updated : Oct 13, 2021, 2:09 PM IST