టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబును ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా..? కేవలం అభిమానులే కాదు.. తన సహనటులతో పాటు దక్షిణాది.. ఉత్తరాది సినీ ప్రముఖులు కూడా మహేశ్‌బాబు అందానికి ఫిదా అయినవాళ్లే. మంచితనాన్ని కొనియాడినవాళ్లే. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. విష్ణు సతీమణి వెరొనికా జన్మదిన వేడుకల్లో మహేశ్ తన సతీమణి నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు.
"ఈ ఫొటోలో ఉన్న ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ యువకుడిలా మారుతూ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఆయన మంచితనమే దానికి ప్రధాన కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని విష్ణు ఆ పోస్టులో పేర్కొన్నాడు.