మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై(MAA Elections) తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబరు 10న జరిగే ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులుగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ ప్రకటించగా.. ఇప్పుడు హీరో విష్ణు తన ప్యానల్‌ను(Manchu Vishnu Panel For MAA) గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు.
MAA Elections: మంచు విష్ణు ప్యానల్లో ఎవరున్నారంటే? - మా ఎలక్షన్స్ 2021
'మా' ఎన్నికలు(MAA Elections) సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి పోటీదారులు ప్రచారంలో దూకుడు పెంచారు. అక్టోబరు 10న జరిగే ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులుగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ ప్రకటించగా.. ఇప్పుడు హీరో విష్ణు తన ప్యానల్‌ను(Manchu Vishnu Panel For MAA) ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.
MAA Elections: మంచు విష్ణు ప్యానల్లో ఎవరున్నారో తెలుసా?
ఈ నేపథ్యంలో విష్ణు ప్యానల్(Manchu Vishnu Panel For MAA) నుంచి పోటీ చేస్తున్న కీలక నటుల పేర్లు కొన్ని బయటకు వచ్చాయి. జనరల్ సెక్రటరీగా రఘుబాబు.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహన్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. హీరో విష్ణు ప్యానల్‌కు 'మా' మాజీ అధ్యక్షుడు(MAA President) నరేశ్ మద్దతు ప్రకటించారు.
ఇదీ చూడండి..'మా' ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల.. నిబంధనలు ఇవే!
Last Updated : Sep 23, 2021, 11:23 AM IST