- సినీ కథానాయకుడు మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆ ఫొటోను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. "ఈ రోజు బిగ్‌బాస్‌ను కలిశాను. ఎందుకు కలిశాననేది త్వరలో వెల్లడిస్తాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను" అని విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, చిరును ఎందుకు కలిశారన్న విషయం చెప్పకపోగా.. కారణం త్వరలోనే వెల్లడిస్తానని చెప్పడం వల్ల సినీవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
- ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'శశి'. బుధవారం హీరో ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇందులో ఆది కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు ఆది నటిస్తున్న 'బ్లాక్' సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.
- జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు హీరో శర్వానంద్. 'రైతు పది వేళ్లు మట్టిలోకి వెళ్తేనే మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి' అని ట్వీట్ చేసి రైతుల ప్రాముఖ్యాన్ని గుర్తుచేసుకున్నారు శర్వా.
- 'కింగ్' నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాస్'. బుధవారం (డిసెంబరు 23) నాటికి ఈ చిత్రం 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2004 డిసెంబరు 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.
- మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'క్రాక్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు విశేషాదరణ దక్కించుకున్నాయి. గురువారం (డిసెంబరు 24) ఉదయం 9 గంటలకు ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేయనున్నారు.
మెగాస్టార్‌తో మంచు విష్ణు.. రైతులకు శర్వా శుభాకాంక్షలు - రైతులకు హీరో శర్వానంద్ శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవిని హీరో మంచు విష్ణు కలిశారు. ఎందుకు కలిశారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని విష్ణు అన్నారు. మరోవైపు 'కింగ్' నాగార్జున నటించిన 'మాస్' చిత్రం విడుదలై బుధవారంతో 16 ఏళ్లు పూర్తి చేసుకోగా.. రైతుల దినోత్సవం సందర్భంగా వారి ప్రాముఖ్యాన్ని హీరో శర్వానంద్ గుర్తు చేసుకున్నారు.
మెగాస్టార్‌తో మంచు విష్ణు.. రైతులకు శర్వా శుభాకాంక్షలు
ఇదీ చూడండి:వైరల్: కిరాక్.. బాలయ్య నయా లుక్