మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' కల త్వరలో నెరవేరనుందని నటుడు మంచు విష్ణు అన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. 'మా'కి శాశ్వత భవనం ఉండాలనేది అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరి కల అని.. అది త్వరలో నిజం కానుందని ఆయన అన్నారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించానని.. వాటిల్లో ఎక్కడ నిర్మించాలనే దానిపై త్వరలోనే అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంచు విష్ణు షేర్ చేసిన వీడియోతో అందరి దృష్టి మరోసారి 'మా' ఎన్నికలపై పడింది.
MAA Elections: 'మా' గురించి మంచు విష్ణు పోస్టు - మా ఎన్నికలపై మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పంచుకున్నారు మంచు విష్ణు. 'మా' కల త్వరలో నెరవేరనుందని అందులో పేర్కొన్నారు. దీంతో అందరి దృష్టి మరోసారి 'మా' ఎన్నికలపై పడింది.
మంచు విష్ణు
ఈ ఏడాది జరగనున్న 'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఇలా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 'మా'కు శాశ్వత భవనం నిర్మించడం.. అసోసియేషన్ సభ్యుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా వీళ్లు పోటీలో దిగుతున్నారు.
ఇదీ చదవండి:'భీమ్లా నాయక్' బ్రేక్ టైమ్‌లో గన్‌తో..
Last Updated : Aug 21, 2021, 12:48 PM IST