మన కథానాయకుల్లో చాలా మంది దర్శకత్వ విభాగం నుంచి వచ్చినవాళ్లే. అగ్ర నటుడు మోహన్‌బాబు కూడా ఆరంభంలో సహాయ దర్శకుడిగానే పనిచేశారు. ఆ తర్వాత కెమెరా ముందుకొచ్చారు. ఇలా దర్శకులు కాబోయి నటులైనవాళ్లు "ఎప్పటికైనా మెగాఫోన్ పట్టి ఒక సినిమా తీయాలనేది నా కల" అని చెబుతుంటారు. మోహన్‌బాబు త్వరలోనే ఆ కలని సాకారం చేసుకోబోతున్నారు. ఆయన దర్శకత్వం చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
దర్శకుడిగా మారనున్న డైలాగ్ కింగ్ మోహన్‌బాబు! - Mohan Babu tollywood news
భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్‌బాబు.. త్వరలో మెగాఫోన్ పట్టుకోనున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ డైలాగ్ కింగ్.. తమిళ హీరో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించారు. ఇది అక్టోబర్‌లో ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
త్వరలోనే 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం కోసం రంగంలోకి దిగబోతున్న మోహన్‌బాబు.. ఆ చిత్రం తర్వాత మోగాఫోన్ పట్టబోతున్నారు. అందుకోసం ఇప్పటికే కథని కూడా సిద్ధం చేయించారు. అందులో నటులెవరనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు మోహన్‌బాబు.
త్వరలో 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు మోహన్‌బాబు. ఇందులో తొలిసారి సొంత పేరుతో కనిపించనున్నారు. చిత్రం తమిళ వెర్షన్‌లోని తన పాత్రకు మోహన్‌బాబే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇందులో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తోంది. ఊర్వశి, జాకీష్రాఫ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. అక్టోబర్ 30న ఓటీటీ వేదిక అమెజాన్‌లో విడుదల కానుందీ సినిమా.