కథానాయకుడు మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్‌కు కాబోయే సతీమణి మంచు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలంటూ వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై ఇప్పుడు మనోజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని వ్యంగ్యంగా చెప్పారు. 'పెళ్లి తేదీ, ముహూర్తం జరిగే సమయం కూడా మీరే చెప్పేయండి' అంటూ కామెంట్ చేశారు. మనోజ్ పెట్టిన ట్వీట్‌తో ఆయన పెళ్లి వార్తల్లో నిజంలేదని స్పష్టమైంది.
రెండో పెళ్లి గురించి మనోజ్ క్రేజీ ట్వీట్
తనకు రెండు పెళ్లి జరగనుందనే వార్తలపై హీరో మనోజ్ స్పందించారు. వివాహ తేది, సమయం కూడా చెప్పేయండని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
రెండో పెళ్లి గురించి మనోజ్ క్రేజీ ట్వీట్
'దొంగా దొంగది' చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్.. ‘రాజుభాయ్’, ‘వేదం’, ‘ఝుమ్మంది నాదం’, ‘పోటుగాడు’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ప్రణతీ రెడ్డితో ఆయన ఏడడుగులు వేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో ప్రణతీ నుంచి తాను విడాకులు తీసుకున్నానని 2019లో మనోజ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ‘అహం బ్రహ్మాస్మి’లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌రెడ్డి దర్శకుడు.