నటుడు మంచు మనోజ్ తన మంచి మనసు మరోసారి చాటుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు తన వంతుగా సాయం చేయనున్నారు. వారికి నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.
25 వేల కుటుంబాలకు అండగా మంచు మనోజ్ - manchu manoj helping nature
నటుడు మంచు మనోజ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.
"ఈ సంవత్సరం నా పుట్టిన రోజున కొవిడ్ వల్ల ప్రభావితం అయిన వాళ్లందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చెయ్యాలి అనుకుంటున్నా. ముందుగా, మన ప్రాణాల్ని కాపాడడానికి వాళ్ల ప్రాణాలను, కుటుంబాన్ని పణంగా పెట్టి మన అందరిని కాపాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి సమయంలోనే మాస్క్‌లు ధరించి, తరచు శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి. నా వంతుగా ఈ పుట్టినరోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి కరోనా వల్ల ప్రభావితమైన 25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సహాయం చేస్తూ ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నా. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం" అన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు మనోజ్.
ప్రస్తుతం మంచు మనోజ్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న 'అహం బ్రహ్మాస్మి'లో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనోజ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.