Manchu Lakshmi Coronavirus: నటుడు మోహన్‌బాబు తనయ, నటి, నిర్మాత మంచు లక్ష్మి కొవిడ్ బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తానే ఈ విషయాన్ని తెలిపారు. బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లుగా తప్పించుకున్నానని, చివరికి దాని బారిన పడ్డానని వివరించారు. కొవిడ్ నుంచి త్వరగా బయటపడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని కోరారు.
మంచు లక్ష్మికి కరోనా.. ఆ సలహా కోరిన నటి! - covid
Manchu Lakshmi Coronavirus: నటి, నిర్మాత మంచు లక్ష్మి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తానే స్వయంగా వెల్లడించారు.
మంచు లక్ష్మి
"కరోనా సాధారణ జలుబులా అందరినీ ఎటాక్ చేస్తోంది. దాంతో మనం పోరాడేందుకు మన వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. మంచి ఆహారం తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి. వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు కొవిడ్ టీకా తీసుకునుంటే బూస్టర్ డోసు కోసం ప్రయత్నించండి" అని విజ్ఞప్తి చేశారు లక్ష్మి. వినోదం కోసం మంచి సినిమాలు, కార్యక్రమాలు, పాడ్‌కాస్ట్‌ల వివరాలు పంపించండంటూ అభిమానుల్ని కోరారు.