సినీనటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు విష్ణు, కోడలు విరోనికా.. మోదీతో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. విరోనికా తయారు చేసిన చిత్రపటాన్ని ప్రధానికి బహుకరించారు.
త్వరలో దక్షిణాది నటులతో ప్రధాని మోదీ సమావేశం! - మంచు విష్ణు
సినీ నటుడు మోహన్ బాబు.. తన కుటుంబసభ్యులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సమావేశంలో మంచు విష్ణు.. దక్షిణాది నటీనటులతో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మోదీని కోరాడు. ఈ విషయంపై ప్రధాని సానుకూలంగా స్పందించారు.
manchu
ఇటీవలే బాలీవుడ్ నటీనటులంతా మోదీని కలవగా, దక్షిణాది నటీనటులు అసంతృప్తికి గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీకి వివరించాడు మంచు విష్ణు. దక్షిణాది నటీనటులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని కోరాడు. ఈ విషయంపై మోదీ అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కలుస్తానని, మోదీ చెప్పినట్లు, విష్ణు మీడియాకు వెల్లడించాడు.
ఇవీ చూడండి.. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం విప్లవ గాయకుడు!
Last Updated : Jan 6, 2020, 11:38 PM IST