తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్ స్క్రీనింగ్​లో తెలుగు షార్ట్​ఫిల్మ్.. 10వ తేదీ నుంచి ఓటింగ్ - ఆస్కార్ అవార్డు

900 పైగా పురస్కారాలు గెలుచుకున్న తెలుగు షార్ట్​ఫిల్మ్ 'మనసా నమః' .. ఆస్కార్ బరిలో నిలిచింది. దీనికి సంబంధించిన ఓటింగ్ 10వ తేదీ నుంచి మొదలు కానుంది.

manase namaha short film
తెలుగు షార్ట్​ఫిల్మ్ ఆస్కార్ అవార్డు

By

Published : Dec 6, 2021, 2:53 PM IST

సినిమాకు అత్యున్నత స్థాయి పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డు బరిలో ఓ తెలుగు లఘుచిత్రం నిలిచింది. వచ్చే ఏడాది ఆస్కార్ పోటీలకు 'మనసా నమః' షార్ట్​ఫిల్మ్ అర్హత సాధించింది.

యువ దర్శకుడు దీపక్ తెరకెక్కించిన ఈ లఘు చిత్రం అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సుమారు 900కుపైగా పురస్కారాలను గెలుచుకుంది.

మనసానమః షార్ట్​ఫిల్మ్

రివర్స్ స్క్రీన్ ప్లే లవ్​స్టోరీగా తీసిన ఈ షార్ట్​ ఫిల్మ్​ను వివిధ దేశాల్లో చూసిన సినీ ప్రియులు.. 'మనసా నమః' ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రశంసించారు. ఆస్కార్ పోటీలో ఉన్న 'మనసానమః'కు ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగనుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్​లో చిత్ర దర్శకుడు దీపక్ తోపాటు నటీనటులు విరాజ్, దృశిక, డీవోపీ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లఘచిత్ర విశేషాలను, ఆస్కార్ పోటీలో ఎంపికపై వివరాలను వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details