ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్ ఐపీఎస్ అధికారిగా నటించిన మలయాళ చిత్రం 'ఫోరెన్సిక్'. దీని తెలుగు వెర్షన్.. జులై 31 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్య కథతో ఉండటం వల్ల ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది.
ఫోరెన్సిక్ ట్రైలర్: పిల్లల్ని చంపుతున్న హంతకుడు ఎవరు? - ఫోరెన్సిక్ సినిమా
'ఫోరెన్సిక్' సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం రేపటి నుంచి ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది.
మమతా మోహన్‌దాస్ ఫోరెన్సిక్ సినిమా
వరుసగా చిన్నపిల్లల హత్యలు జరుగుతుంటాయి. వారిని చంపుతున్న ఆ హంతకుడు ఎవరు? ఫోరెన్సిక్ నిపుణుడు పోలీసులకు ఎలాంటి సాయం చేశాడు? చివరకు ఏమైంది? అనేది ఈ చిత్ర కథాంశం.
ఇందులో టొవినో థామస్, మమతా మోహన్‌దాస్, ప్రతాప్ పోతన్, శ్రీకాంత్ మురళీ, రెబా మోనికా తదితరులు నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.