తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇబ్బందిగా ఉంటే నా సినిమాలు చూడొద్దు : మల్లికా శెరావత్‌ - నెటిజన్​పై నటి మల్లికా షెరావత్​ ఫైర్​

తన సినిమాలను తప్పుపడుతూ ఓ నెటిజన్​ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌. ఇబ్బందిగా ఉంటే తన సినిమాలు చూడొద్దని ఘాటుగా స్పందించారు.

Mallika Sherawat
మల్లికా శెరావత్‌

By

Published : Oct 8, 2020, 5:10 PM IST

Updated : Oct 8, 2020, 6:20 PM IST

తాను ప్రధాన పాత్రలో నటించిన సినిమాలను తప్పుపడుతూ ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌ మండిపడ్డారు. ఇబ్బంది ఉంటే తన సినిమాలు చూడొద్దని సదరు నెటిజన్‌కు సూచించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో ఇటీవల మల్లిక సోషల్‌మీడియా వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. ‘మహిళల పట్ల ధోరణి మారే విధంగా దేశంలో సంస్కరణలు తీసుకువచ్చే వరకూ ఈ పరిస్థితులే కొనసాగుతాయి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా, మల్లిక ట్వీట్‌పై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'బాలీవుడ్‌లో మీరు నటించిన సినిమాలు.. మీరు ఇచ్చే సందేశాలకు విరుద్ధంగా ఉన్నాయి. సినిమాల ద్వారా ఇచ్చే సందేశం కూడా సమాజంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మీకు తెలియదా? నీతి సూక్తులు చెప్పేముందు.. వాటిని పాటించి.. ఆ తర్వాతే బయట వారికి చెప్పాలి' అని నెటిజన్‌ బదులిచ్చాడు.

అయితే, నెటిజన్‌ ట్వీట్​పై‌ మల్లిక ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను నటించిన సినిమాలు అత్యాచారం చేయడానికి ప్రేరేపించేలా ఉన్నాయని మీ ఉద్దేశం! మీలాంటి మనస్తత్వం ఉన్న వారివల్లే దేశంలో మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా సినిమాల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే.. వాటిని చూడకండి' అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఇదీ చూడండి కరోనాపై పోరులో మోదీకి బాలీవుడ్​ మద్దతు

Last Updated : Oct 8, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details