తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీకే ఓటేసిన సుమంత్ 'మళ్ళీ మొదలైంది'! - మళ్లీ మొదలైంది మూవీ అప్​డేట్స్​

Malli Modalaindi OTT: సుమంత్ అక్కినేని​ హీరోగా టీజీ కీర్తి కుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'మళ్ళీ మొదలైంది' చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 'జీ5' ఓటీటీలో ఎక్స్​క్లూజివ్​గా రిలీజ్​ చేయనున్నట్లు సమాచారం.

Malli Modalaindi OTT
Malli Modalaindi OTT

By

Published : Jan 21, 2022, 4:25 PM IST

Malli Modalaindi OTT: దేశంలో కరోనా మూడోదశ విజృంభణ కొనసాగుతోంది. దీంతో అన్నిరంగాలు ప్రభావితమవుతున్నాయి. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నాయి. సినిమాలు మళ్లీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడు సుమంత్​ అక్కినేని హీరోగా టీజీ కీర్తి కుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మళ్ళీ మొదలైంది' నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 'జీ5' ఓటీటీలో ఎక్స్​క్లూజివ్​గా రిలీజ్​ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓటీటీ రైట్స్​ను చేజిక్కించుకున్నట్లు సమాచారం. జీ5 కూడా దీనికి సంబంధించిన క్లూ ఇచ్చింది. ఫిబ్రవరిలో సినిమాను ఓటీటీలో రిలీజ్​ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే..? అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'మళ్ళీ మొదలైంది'. ఈ సినిమాలో సుమంత్‌కు జోడీగా నైనా గంగూలీ కనిపించనుంది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణి సౌందర్​ రాజన్​ నటించింది. ఈడీ ఎంటర్టైన్మెంట్​ బ్యానర్​పై రాజశేఖర్​ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్​ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్​లుక్​ క్యారెక్టర్​ పోస్టర్లు, టీజర్​, ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి:'మనీహైస్ట్'​ తరహా వెబ్​సిరీస్​.. తెలుగులో!

ABOUT THE AUTHOR

...view details