తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జూన్ 21న ప్రేక్షకుల ముందుకు 'మ‌ల్లేశం' - mallesham

చేనేత కళాకారుడు, ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింద మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మల్లేశం'. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.

మల్లేశం

By

Published : May 27, 2019, 9:05 PM IST

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌, ఆసు యంత్రాన్ని కనుగొన్న చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మల్లేశం’. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మ‌ల్లేశం పాత్ర‌లో న‌టిస్తున్నాడు ప్రియ‌ద‌ర్శి. ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు రాజ్.ఆర్. ఈ సినిమా చిత్రీకరణ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ు పూర్తి చేసి సినిమాను జూన్ 21న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనుంది.

ఝాన్సీ, అన‌న్య స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలు శాండిల్య‌స సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌రలోనే ఈ సినిమా ట్రైల‌ర్‌, పాట‌ల‌ను విడుద‌ల చేసేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

మల్లేశం చిత్రంలో సన్నివేశం

ఇవీ చూడండి.. సాహో సినిమా నుంచి వారు తప్పుకున్నారు..!

ABOUT THE AUTHOR

...view details