'పింక్' తెలుగు రీమేక్‌లో కథానాయిక ఎవరా? అనే సందేహానికి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ కారణంతో రోజుకో హీరోయిన్ పేరు చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో మరో యువనటి పేరు తెరపైకి వచ్చింది. ఆమే.. అనన్య. 'మల్లేశం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ సరసన అవకాశం దక్కించుకుందని చిత్ర సీమలో ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
పవన్ 'పింక్'లో మరో యువ హీరోయిన్? - TOLLYWOOD NEWS
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీఎంట్రీ ఇచ్చే 'పింక్' తెలుగు రీమేక్‌లో ఓ హీరోయిన్గా అనన్య ఎంపికైందట. 'మల్లేశం'లోని తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించిందీ భామ.
కోర్టు నేపథ్యంలో ముగ్గురు అమ్మాయిలు చుట్టూ తిరుగుతుందీ కథ. హిందీలో తాప్సీ, ఆండ్రియా, పియూష మిశ్రా నటించారు. వీళ్లలో ఓ పాత్రను అనన్య పోషిస్తుందట. ఇతర పాత్రల్లో ఎవరు కనిపిస్తారో చూడాలి. ఇప్పటికే నివేదా థామస్, అంజలి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ చిత్రం 'పింక్'. తెలుగులో పవన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు.
ఇది చదవండి: తెలుగు హీరోలు చాలా మందికి తెలుగే సరిగా రాయడం రాదు: పవన్‌కల్యాణ్