కాస్త విరామం దొరికితే చాలు సినిమా తారలు వెంటనే మాల్దీవుల బాట పడుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ తారల వల్ల మాల్దీవులు మరో ముంబయిలా మారింది. చాలామంది బర్త్‌డే, మ్యారేజ్‌డే.. ఇలా విశేషమేదైనా మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోయిన్లతే అక్కడ హాట్‌హాట్ ఫొటోషూట్‌లు చేసి.. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని మురిసిపోతుంటారు.
అయ్యో.. ఇప్పుడెలా వెళ్తారు మాల్దీవులు! - అయ్యో.. ఇప్పుడెలా వెళ్తారు మాల్దీవులు!
కాస్త విరామం దొరికితే చాలు మాల్దీవుల్లో వాలిపోతుంటారు మన తారలు. అక్కడ ఫొటోషూట్స్‌తో తెగ సందడి చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా భారత్ నుంచి పర్యాటకుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది అక్కడి పర్యాటక శాఖ. దీంతో నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి మీమ్స్.
అయ్యో.. ఇప్పుడెలా వెళ్తారు మాల్దీవులు!
అయితే.. అలాంటి వారందరికీ ఇది నిజంగా చేదువార్త. భారత్ నుంచి పర్యాటకుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ మాల్దీవులు పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. దీంతో బాలీవుడ్ తారలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ఏ ఫొటోలు పంచుకోవాలి.. ఏ పోస్టులు చేయాలంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. అనవసరంగా టికెట్లు బుక్ చేశానంటూ బాధపడుతున్నట్లుగా మీమ్స్ కూడా తెగ సందడి చేస్తున్నాయి.