మలయాళ నటుడు మాండపు కుంజుట్టన్(81) మంగళవారం కన్నుమూశారు. గతవారం కరోనా బారిన పడిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్రాల్లో రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గానూ గుర్తింపు పొందిన కుంజుట్టన్.. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి - మాండపు కుంజుట్టన్
ప్రముఖ మలయాళ సినీ రచయిత, నటుడు మాండపు కుంజుట్టన్(81) మరణించారు. గతవారం కరోనా బారిన పడిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.
![కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి Malayalam writer and actor Madampu Kunjukuttan passes away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11717579-327-11717579-1620715231607.jpg)
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
కుంజుట్టన్ అసలు పేరు మాండబు శంకరన్ నంబూతిరి. 'పోథెన్వావ', 'వడకుమ్నాథన్', 'అగ్ని నక్షత్రం', 'అగ్నిసాక్షి', 'దేశదానం', 'అనచండం', 'అరమ్ తంబురాన్' వంటి మలయాళ చిత్రాలలో ఆయన నటించారు. వీటితో పాటు 'కరుణం', 'పరినామం', 'మకాల్కు', 'దేశదానం', 'గౌరిశంకరం' సినిమాలకు రచయితగా పనిచేశారు. జయరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుణమ్' సినిమాకు గానూ ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు కుంజుట్టన్.