మలయాళ టీవీ సీరియల్ నటుడు రమేశ్ వలియసాలా(ramesh valiyasala).. శనివారం అనుమానస్పద రీతిలో మృతి(actor death) చెందారు. తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
దాదాపు 22 ఏళ్ల నుంచి సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ రమేశ్ బిజీగా ఉన్నారు. రెండు రోజుల క్రితమే షూటింగ్ ముగించుకుని తిరువనంతపురంలోని తన ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆయన మరణం కేరళ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు నటీనటులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.