తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ 'సలార్'​లో మలయాళ స్టార్​!

Prabhas Salar Prithviraj: మలయాళ స్టార్​ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్​.. 'సలార్​' సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హీరో ప్రభాస్​ తెలిపారు.

Malayalam star Prithviraj in prabhas Salar movie
ప్రభాస్​ 'సలార్'​లో మలయాళ స్టార్​

By

Published : Mar 9, 2022, 9:17 AM IST

Prabhas Salar Prithviraj: 'కేజీఎఫ్'​ ఫేం ప్రశాంత్​నీల్​ దర్శకత్వంలో హీరో ప్రభాస్​ నటిస్తున్న సినిమా 'సలార్​'. ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు డార్లింగ్​​. ఈ మూవీలో మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్​ ఓ కీలక పోషిస్తున్నారని తెలిపారు. తన తాజా చిత్రం 'రాధేశ్యామ్'​ ప్రమోషన్​ ఈవెంట్​లో భాగంగా ఓ విలేకరి అడగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు.

ఈ చిత్రం అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంటుందని ప్రభాస్​ ఆశాభావం వ్యక్తం చేశారు. "సినిమా స్క్రిప్ట్​, తన పాత్ర పృథ్వీరాజ్​కు నచ్చడం వల్ల వెంటనే ఒప్పేసుకున్నారు. అతనికి కృతజ్ఞతలు." అని డార్లింగ్​ అన్నారు. కాగా, 'సలార్'​ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి బస్​రూర్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

'రాధేశ్యామ్'​ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకుడిగా వ్యవహరించగా.. పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది.

ఇదీ చూడండి: హీరోయిన్ల జోరు.. వరుస సినిమాలతో హోరు

ABOUT THE AUTHOR

...view details