తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దృశ్యం 3'పై క్లారిటీ.. వచ్చేది అప్పుడే! - jeetu joseph drishyam

సరైన కథ సిద్ధమైతే 'దృశ్యం 3'ను తెరకెక్కించే అవకాశముందని తెలిపారు దర్శకుడు జీతూ జోసెఫ్. ఇటీవల విడుదలైన 'దృశ్యం 2' ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుని సూపర్​ హిట్​గా నిలిచింది.

drishyam
దృశ్యం

By

Published : Feb 25, 2021, 11:44 AM IST

'దృశ్యం'కు సీక్వెల్​గా వచ్చిన 'దృశ్యం 2' ఇటీవలే విడుదలై సూపర్​ హిట్​ టాక్​ తెచ్చుకుంది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను బాషాభేదం లేకుండా అందరూ ఆదరిస్తున్నారు. అయితే ఈ సీక్వెల్​కు కొనసాగింపుగా మూడో భాగాన్ని తీసే అవకాశముందని అన్నారు దర్శకుడు జీతూ జోసెఫ్.

"క్లైమాక్స్ సినిమాను​ తీయాలని అనుకుంటున్నాం. ఈ విషయంపై మోహన్​లాల్​, నిర్మాత ఆంటోని పెరుమ్​బవూర్​తో చర్చించాను. అందుకు తగ్గ కథ సిద్ధమైతే రెండు, మూడేళ్లలో 'దృశ్యం 3' తెరకెక్కించే అవకాశముంది. అయితే ఈ చిత్రాన్ని వ్యాపార​ కోణంలో రూపొందించాలనుకోవట్లేదు."

-జీతూ జోసెఫ్​, దర్శకుడు.

'దృశ్యం2'ను తెలుగులోనూ రీమేక్‌ చేయనున్నారు. మాతృకను తెరకెక్కించిన జీతూజోసెఫ్‌ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. ఇందులో వెంకటేశ్​, మీనా జంటగా నటిస్తున్నారు.

ఇదీ చూడండి:అదే జోడీతో తెలుగు 'దృశ్యం2'

ABOUT THE AUTHOR

...view details