మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవలే కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలడం వల్ల ఐసోలోషన్‌లో ఉన్న ఈయన ప్రస్తుతం లక్షణాలేవీ లేవంటూ తెలిపారు.
మలయాళ నటుడు పృథ్వీరాజ్‌కు కరోనా - పృథ్వీరాజ్ కరోనా
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌కు కరోనా
"అందరికీ హాయ్. అక్టోబర్ 7 నుంచి నేను 'జనగణమన' చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నా. షూటింగ్ సెట్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో నేను ఐసోలేషన్‌లో ఉన్నా. ప్రస్తుతం నాకు లక్షణాలేవీ లేవు. ఆరోగ్యం బాగానే ఉంది. నాతో కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నా" అంటూ పృథ్వీరాజ్ పేర్కొన్నారు.