హిమాచల్ వరదల్లో చిక్కుకున్న కేరళ నటి మంజు వారియర్‌ను కాపాడారు అక్కడి అధికారులు. మలయాళీ సినిమా 'కథయం పావోలా' చిత్రీకరణలో భాగంగా మనాలీకి 80 కిలోమీటర్ల దూరంలోని ఛత్రాకు వెళ్లారు వారియర్. ఆమెతో పాటు చిత్ర బృందంలోని 30 మంది వరదల్లో చిక్కుకున్నారు.
వరదల్లో చిక్కుకున్న కేరళ హీరోయిన్ క్షేమం - chatra
హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల్లో చిక్కుకున్న మలయాళీ నటి మంజు వారియర్ సురక్షితంగా బయటపడ్డారు. ఛత్రాలో చిక్కుకుపోయిన 'కథయం పావోలా' చిత్రబృందాన్ని కాపాడిన అధికారులు.. వారిని మనాలీకి తరలించినట్లు తెలిపారు.
మంజు వారియర్
హీరోయిన్ వరదల్లో చిక్కుకున్నట్లు తెలుసుకున్న వారియర్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి మురళీధరన్‌ను సంప్రదించారు. ఆయన ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపట్టారు అధికారులు. ఆమెను, చిత్రబృందంలోని ఇతర సభ్యులను సురక్షితంగా మనాలీకి తరలించారు.
ఇదీ చూడండి: నీట మునిగిన పురాతన మండి మహాదేవ్ ఆలయం
Last Updated : Sep 27, 2019, 4:19 PM IST