మలయాళీ ప్రముఖ నటుడు అనిల్ మురళి(56) ఇకలేరు. కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈరోజు తుదిశ్వాస విడిచారు.
సీనియర్ నటుడు మురళి కన్నుమూత - మలయాళ నటుడు మురళి కన్నుమూత
దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు అనిల్ మురళి.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
![సీనియర్ నటుడు మురళి కన్నుమూత ప్రముఖ నటుడు మురళి కన్నుమూత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8234509-839-8234509-1596114783862.jpg)
బుల్లితెర నటుడిగా సినీ జీవితం ప్రారంభించిన మురళి.. తక్కువ కాలంలోనే సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. 'కన్యాకుమారిల్ ఓరు కవితస' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. దక్షిణాదిలో తెలుగు, తమిళం, మలయాళంలో మొత్తం కలిపి 150 సినిమాల్లో నటించారు.
మురళికి భార్య సుమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెలుగులో 'జెండాపై కపిరాజు', 'రంగేళి కాశీ'లో నటించారు. ఆయన నటించిన 'సిటీ ఆఫ్ గాడ్', 'బాడీగార్డ్', 'అవతారం', 'రాక్ అండ్ రోల్', 'ఉయరే', 'బ్రదర్స్ డే' లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మలయాళంలో మమతా మోహన్‌దాస్‌తో కలిసి 'ఫోరెన్సిక్'లో చివరగా నటించారు.