Chiranjeevi Venkikudumula movie: తమిళ బ్యూటీ మాళవిక మోహనన్‌కు బంపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే కొత్త సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మాళవికను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది.
తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మాళవిక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చురుగ్గా ఉంటుంది. ఆమె నటించిన కొత్త చిత్రం 'మారన్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, చిరు త్వరలోనే 'ఆచార్య'తో థియేటర్లలో సందడి చేయనున్నారు. 'భోళాశంకర్', 'గాడ్‌ఫాదర్', 'వాల్తేరు వీర్రాజు' చిత్రాల్లోనూ నటిస్తున్నారు.