కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బాలీవుడ్ నటి మలైకా అరోరా నివాసం ఉంటున్న భవనానికి శానిటైజేషన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మలైకా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. "మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు." అంటూ పోస్ట్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ నివాస భవనానికి శానిటైజేషన్ - corona malaika arora news
బాలీవుడ్ భామ మలైకా అరోరా భవనానికి శానిటైజేషన్ చేశారు. ఇటీవలే ఆమె నివాసం ఉంటున్న ఆవరణలో ఒకరికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలోనే మలైకా ఉంటున్న భవనాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
![బాలీవుడ్ బ్యూటీ నివాస భవనానికి శానిటైజేషన్ Malaika Arora's building gets sanitised](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7740453-483-7740453-1592919860722.jpg)
బాలీవుడ్ బ్యూటీ నివాస భవనానికి శానిటైజేషన్
జూన్ 11న ముంబయిలో ఆమె ఉంటున్న నివాస ఆవరణలో ఒకరికి కరోనా సోకడం వల్ల ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఫలితంగా ఆమె క్వారంటైన్లో ఉన్నారు. లాక్డౌన్ వేళ మలైకా ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇంట్లో తాను గడిపే విధానంతో పాటు.. యోగా వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది.
ఇదీ చూడండి:క్వారంటైన్లో బాలీవుడ్ బ్యూటీ నివాస భవనం