తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుణ్‌తేజ్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్​ డైరెక్టర్​​ - గని కోసం హాలీవుడ్​ స్టంట్​ మాస్టర్​

బాక్సింగ్​ నేపథ్యంలో వరుణ్​తేజ్​ హీరోగా నటిస్తోన్న చిత్రం 'గని'. కిరణ్​ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో సయీ మంజ్రేకర్​ హీరోయిన్​గా నటిస్తోంది. అయితే ఇందులో యాక్షన్​ సీక్వెన్స్​ కోసం ఓ హాలీవుడ్​ ఫైట్​ మాస్టర్​ను ఎంపికచేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

Makers of Varun Tej's Ghani hire Hollywood stunt choreographers
వరుణ్‌తేజ్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్​ మాస్టర్‌

By

Published : May 27, 2021, 5:32 AM IST

మెగా హీరో వరుణ్‌తేజ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ ఓ బాక్సింగ్‌ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

అదేంటంటే.. సినిమాలో కీలకమైన బాక్సింగ్‌ ఎపిసోడ్‌ కోసం ప్రముఖ హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌ వ్లాడ్‌ రింబర్‌ పనిచేయనున్నారట. ఆ ఫైట్‌ సన్నివేశాన్ని భారీ స్టేడియంలో చిత్రీకరించనున్నారు. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, సునీల్‌శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పిస్తుండగా, రెనైసెన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ ప్రముఖ బాక్సర్‌ టోనీ జెఫ్రీస్‌ దగ్గర ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.

ఇదీ చూడండి..ధ్యాన్​చంద్​ బయోపిక్​ నుంచి తప్పుకున్న బాలీవుడ్​ హీరో

ABOUT THE AUTHOR

...view details