26/11 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్'. యువ నటుడు అడివి శేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాను జులై 2న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్‌తో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. సరైన సమయంలో రిలీజ్ డేట్ మరోసారి ప్రకటిస్తామని వెల్లడించింది.
'మేజర్' రిలీజ్ వాయిదా.. '18 పేజెస్' ఫస్ట్‌లుక్ - జూన్ 1న 18 పేజెస్ ఫస్ట్‌లుక్
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న 'మేజర్' చిత్రం కరోనా కారణంగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకుంది. అలాగే నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న '18 పేజెస్' ఫస్ట్‌లుక్‌కు ముహూర్తం ఖరారైంది.
మేజర్, 18 పేజెస్
యువ నటుడు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా '18 పేజెస్' తెరకెక్కుతోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ముహూర్తు కుదిరింది. జూన్ 1న ఈ చిత్ర పస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు